వానల్లేవని.. పంట దక్కదేమోనని.. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
పంట దిగుబడిపై ఆందోళనతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకొన్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగ్వికి చెందిన తీగల రమేశ్ యాదవ్ (47) తనకున్న ఎనిమిదెకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. గతేడాది భూమిని తనఖా పెట్టి ప్రైవేట్‌గా రూ.15 లక్షల రుణం తీసుకున్నాడు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పంటలు సరిగా పండుతాయో లేదోనన్న ఆందోళనకు గురయ్యాడు.
- రుణభారంతో చేనులోనే కుప్పకూలిన రమేశ్
- ఆదిలాబాద్ జిల్లా లాండసాంగ్విలో ఘటన
ఎదులాపురం, సెప్టెంబర్ 27 : పంట దిగుబడిపై ఆందోళనతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకొన్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగ్వికి చెందిన తీగల రమేశ్ యాదవ్ (47) తనకున్న ఎనిమిదెకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. గతేడాది భూమిని తనఖా పెట్టి ప్రైవేట్‌గా రూ.15 లక్షల రుణం తీసుకున్నాడు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పంటలు సరిగా పండుతాయో లేదోనన్న ఆందోళనకు గురయ్యాడు.
ఓ వైపు రుణభారం, మరోవైపు పంటల పరిస్థితిపై ఆందోళనతో మనస్తాపానికి గురైన రమేశ్ శనివారం సాయంత్రం చేనుకు వెళ్లి ఎంతకీరాలేదు. కుటుంబసభ్యులు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడిఉన్నాడు. వెంటనే దవాఖానకు తరలించగా.. పురుగుల మందు తాగి మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. భార్య పుష్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

