Watch: టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణించిన పోలీస్.. టీటీఈ ఏం చేశాడంటే?
Railway TTE Reprimands Cop | ఒక పోలీస్ ఎలాంటి టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణించాడు. ఒక బెర్త్‌పై హాయిగా నిద్రించాడు. దీనిని గుర్తించిన టీటీఈ ఆ పోలీస్‌ను నిలదీశాడు. రైలు మీ ఇల్లు అని అనుకుంటున్నారా? అని మందలించాడు.
న్యూఢిల్లీ: ఒక పోలీస్ ఎలాంటి టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణించాడు. ఒక బెర్త్‌పై హాయిగా నిద్రించాడు. దీనిని గుర్తించిన టీటీఈ ఆ పోలీస్‌ను నిలదీశాడు. రైలు మీ ఇల్లు అని అనుకుంటున్నారా? అని మందలించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Railway TTE Reprimands Cop) యూనిఫార్మ్‌లో ఉన్న ఒక పోలీస్ రైలులోని ఏసీ కోచ్‌లో ప్రయాణించాడు. ఖాళీగా ఉన్న బెర్త్‌పై నిద్రించాడు. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) ఆ బెర్ట్ వద్దకు వచ్చాడు. టికెట్ చూపించాలని ఆ పోలీస్‌ను అడిగాడు.
కాగా, ఆ పోలీస్ టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నట్లు టీటీఈ తెలుసుకున్నాడు. దీంతో యూనిఫార్మ్ ధరించిన పోలీస్‌ను టికెట్ చూపించమని టీటీఈ అడగకూడదని మీరు అనుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. ‘కనీసం జనరల్ కోచ్ టికెట్ కూడా మీ వద్ద లేదు. కానీ ఏసీ కోచ్‌లో నిద్రపోతున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ పడుకోవడానికి ఇది మీ ఇల్లని అనుకుంటున్నారా? లేచి వెళ్లండి’ అని మండిపడ్డాడు. దీంతో ఆ పోలీస్ బెర్త్ నుంచి లేచి తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరోవైపు రెడ్డిట్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణించిన పోలీస్‌ను ధైర్యంగా టీటీఈ నిలదీయడాన్ని నెటిజన్లు ప్రశంసించారు. అయితే టికెట్ లేకుండా ప్రయాణించిన ఆ పోలీస్‌కు ఎలాంటి జరిమానా విధించకుండా టీటీఈ వదిలేసిన తీరును కొందరు విమర్శించారు.
TTE confronts a cop for travelling without ticket in the AC coach
byu/Depressed-Devil22 inindianrailways
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AC coach
- Cop
- Railway
- Reprimands
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

