Bihar cabinet : బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీశ్ కుమార్ (Nitish Kumar) ఇవాళ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేల (BJP MLAs) కు మంత్రివర్గం (Cabinet) లో చోటు కల్పించారు. ఈ ఏడాది నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనుండగా ఇప్పుడు సీఎం నితీశ్ తన క్యాబినెట్‌ను విస్తరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కొత్తగా నితీశ్ క్యాబినెట్లో చేరిన ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేల్లో సంజయ్ సరోగి, సునీల్ కుమార్, జిబేశ్ మిశ్రా, మోతీలాల్ ప్రసాద్, క్రిషన్ కుమార్ మాంటూ, రాజు కుమార్ సింగ్, విజయ్ కుమార్ మండల్ ఉన్నారు. వారందరూ బుధవారం సాయంత్రం 4 గంటలకు మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేశారు. బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వారి చేత ప్రమాణస్వీకారాలు చేయించారు.
ఇటీవల బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి దిలీప్ జైస్వాల్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే పార్టీ పాలసీకి అనుగుణంగా తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఆరుగురు నూతనంగా మంత్రులుగా ప్రమాణం చేసినందున.. జైస్వాల్ రాజీనామా చేస్తే బీహార్ మంత్రి వర్గంలో మొత్తం ఆరుగురు మంత్రులు పెరగనున్నారు.
#WATCH | BJP MLAs Jibesh Kumar and Raju Kumar Singh take oath as Bihar ministers as CM Nitish Kumar expands his Cabinet pic.twitter.com/oWG1rRAtDm
— ANI (@ANI) February 26, 2025
#WATCH | Patna | BJP MLA from Biharsharif, Dr Sunil Kumar takes oath as minister during Cabinet expansion pic.twitter.com/VJU4j9PO5R
— ANI (@ANI) February 26, 2025
#WATCH | Patna | Bihar Cabinet expansion | BJP MLAs Motilal Prasad and Krishna Kumar Mantoo take oath as ministers pic.twitter.com/rEVC4EWwLX
— ANI (@ANI) February 26, 2025
Life Ban | వారిపై లైఫ్ బ్యాన్ అత్యంత కఠినం.. ఆరేళ్ల నిషేధం చాలు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
Amit Shah | తమిళనాడులో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే : అమిత్ షా
Arvind Kejriwal | కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లడం లేదు.. అవి ఆధారంలేని ఊహాగానాలు : ఆప్
Wild Animals | వైల్డ్ వార్.. దేశంలో మనుషులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణ