ముంబయి: పహల్గాం ఉగ్రదాడి ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం.. మాటను నిలబెట్టుకోవటంలో విఫలమైంది. 10 నెలలు దాటినా బాధిత కుటుంబం గోడు వినేందుకు బీజేపీ నాయకులు ఆసక్తి చూపటం లేదు.
పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లలోపుణెకు చెందిన సంతోష్ జగదాలే ఒకరు. అతడి కుమార్తె ఆస్వారీ జగదాలేకు ప్రభుత్వ ఉద్యోగమిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఇప్పటికీ ఆ వాగ్దానం నెరవేరలేదని ఆస్వారీ జగదాలే సోమవారం మీడియా ముందు వాపోయారు.