DYFI | హనుమకొండ చౌరస్తా, జనవరి 8: రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తుందని డీవైఎఫ్ఐ రాష్ర్ట అధ్యక్షుడు కోట రమేష్ విమర్శించారు. గురువారం హనుమకొండ రాంనగర్ సుందరయ్య భవన్ లో డివైఎఫ్ఐ జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రమేష్ ప్రసంగిస్తూ.. నిరుద్యోగ యువతకు అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిందన్నారు.
దేశంలో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు యువతకు ఇచ్చిన హామీలు కేవలం ఓట్లు దక్కించుకునే ఎత్తుగడలేనని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిన బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పుతుందని, ఉద్యోగాలు లేకుండా చేస్తుందన్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ ఏటా లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లతోనే ఉద్యోగాలను భర్తీ చేసి చేతులు దులుపుకుందని, ఉద్యోగాలు ఇచ్చేంతవరకు నిరుద్యోగ భృతి నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా యువతకు ఎటువంటి ఉపశమనం కలగలేదని, నియామక ప్రక్రియలు నత్తనడకన సాగుతున్నాయని, నిరుద్యోగులు నిరీక్షణతో విసిగిపోతున్నారని, ఇటీవల ప్రవేశపెట్టిన‘రాజీవ్ యువ వికాసం’ పథకం కూడా మరో నిరాశగా మిగిలిందన్నారు.
ప్రతి యువతి చేతికి ఒక స్కూటీ ఇస్తామన్నారు..
ఎన్నికల సమయంలో ప్రతి యువతికి చేతికి ఒక స్కూటీ ఇస్తామని చెప్పిన హామీ కూడా మరచిపోయారని విమర్శించారు. నిరుద్యోగ యువతపై నిర్లక్ష్యం వీడి కేంద్ర ప్రభుత్వం ప్రతీ యేటా ఇస్తామని రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ కార్యదర్శి దుగ్గెల తిరుపతి, జంపాల రమేష్, నాయకులు సముద్రాల అనిల్, మంద తేజ, బండారి నరేష్, ఎస్కే సమీర్, వేముల కర్ణాకర్, పల్లర్ల సతీష్ పాల్గొన్నారు.
Tirupati Express | తిరుపతి ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం..మంటలను ఆర్పివేసిన సిబ్బంది
Mamata Banerjee | కోల్కతాలో ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ దాడులు.. తీవ్రంగా ఖండించిన సీఎం మమత
Bomb Threats | ఏపీలో మూడు జిల్లాల కోర్టులకు బాంబు బెదిరింపులు