Explosion Rocks Tehran | ఇరాన్ రాజధానిలో భారీ నిరసన ర్యాలీ.. ఇజ్రాయెల్ దాడుల్లో మహిళ మృతి
Explosion Rocks Tehran | అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం 14వ రోజుకు చేరింది. శుక్రవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అమెరికా-ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో టెహ్రాన్‌లోని ప్రొటెస్ట్ స్క్వేర్ సమీపంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి.
టెహ్రాన్: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం 14వ రోజుకు చేరింది. శుక్రవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అమెరికా-ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో టెహ్రాన్‌లోని ప్రొటెస్ట్ స్క్వేర్ సమీపంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. (Explosion Rocks Tehran) పాలస్తీనా పోరాటానికి మద్దతుగా, రంజాన్ మాసపు చివరి శుక్రవారమైన ‘కుద్స్ దినోత్సవం’ సందర్భంగా టెహ్రాన్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో ప్రజలు భారీగా గుమిగూడారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంపై నిరసన తెలిపారు.
కాగా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో టెహ్రాన్‌లోని ప్రొటెస్ట్ స్క్వేర్ సమీపంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ప్రభుత్వ అనుకూల ప్రదర్శన జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోనే బాంబు దాడులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక మహిళ మరణించినట్లు తెలుస్తున్నది. అయితే ఈ దాడులు జరిగినప్పటికీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సహా సీనియర్ అధికారులు సామూహిక ర్యాలీకి హాజరయ్యారు. ఇరాన్ ప్రజలతో సెల్ఫీలు దిగారు.
మరోవైపు నిరసన ర్యాలీ వద్ద దాడుల నేపథ్యంలో అమెరికా-ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. శత్రువులకు మరిచిపోలేని గుపాఠం నేర్పుతామని పేర్కొంది. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులను ఇరాన్ కొనసాగించింది. ఇరాన్ ప్రతిదాడుల్లో దుబాయ్ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంలోని ఒక భవనం ధ్వంసమైంది. అయితే వచ్చే వారం ఇరాన్‌పై మరింత తీవ్రంగా దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక ఇంటర్వూలో వార్నింగ్ ఇచ్చారు.
#WATCH | Iran: Thousands of people gathered in Tehran on the occasion of ‘Youm-e-Quds’ and held a protest march over the death of Iran’s Supreme Leader Ayatollah Ali Khamenei, who was killed in Israeli and US strikes. People are protesting against the Israel–US War on Iran.… pic.twitter.com/kAW9coxQBN
— ANI (@ANI) March 13, 2026
Also Read:
Mojtaba Khamenei | అమరవీరుల ప్రతీకారం తీర్చుకుంటాం.. హార్ముజ్ జలసంధి మూసేస్తాం: మోజ్తాబా ఖమేనీ
US Military: ఇరాక్‌లో కూలిన అమెరికా రీఫ్యుయలింగ్ విమానం
USS Abraham Lincoln: అబ్రహం లింకన్ యుద్ధ నౌకకు ఏమైంది?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

