తుంగతుర్తి, మార్చి 13 : తుంగతుర్తి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలో భాగంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఎంఈఓ బోయిన లింగయ్య మాట్లాడుతూ మండలంలోని వివిధ పాఠశాల నుండి హాజరైన విద్యార్థులకు రన్నింగ్, మెడిసిన్ బాల్, హైట్, బరువు వంటి పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. మార్చి 28 నుండి ఏప్రిల్ 1 వరకు జరిగే జిల్లా స్థాయి పోటీలకు 8 మంది బాలురు, ఆరుగురు బాలికలు మండలం నుండి ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ కొండగడుపుల యాకయ్య, ఉపాధ్యాయులు మల్లెపాక రవీందర్, శ్రీనివాస్, నరేశ్ పాల్గొన్నారు.