జూలూరుపాడులో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని హోటళ్లు, కిరాణా దుకాణాలపై సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు..
– 34 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
జూలూరుపాడు, మార్చి 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని హోటళ్లు, కిరాణా దుకాణాలపై సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై జిల్లా అధికారి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో మొత్తం 34 అక్రమ గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కిరాణా షాపులు, హోటళ్లలో అక్రమంగా దాచిన సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సామాన్యుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఎక్కువ రేట్లకు అమ్ముతున్న వారిపై చర్యలు చేపడతామని హెచ్చరించారు.
గ్యాస్ కొరత లేదని, అవసరానికి మించి నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీఎస్ఓ (ACSO) వరదరాజులు హెచ్చరించారు. ప్రజలకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఎవరూ ఆందోళన చెంది అధిక ధరలకు కొనవద్దు. అక్రమంగా నిల్వ చేసే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై ఆర్ఐ వెంకటేశ్వర్లు, భద్రాచలం డిప్యూటీ తాసీల్దార్ రాజులు, ఇల్లెందు యుడిఆర్ఐ రాంబాబు, జూలూరుపాడు పోలీసులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

