ICAI | హనుమకొండ చౌరస్తా, మార్చి 23: ప్రముఖ ఛార్టెడ్ అకౌంటెంట్ సీఏ పీవీ నారాయణరావు న్యూఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అతి ముఖ్యమైన కమిటీ సస్టైనబిలిటీ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ బోర్డు (ఎస్ఆర్ఎస్బీ)లో కో-ఆప్టెడ్ మెంబర్గా 2026-27 సంవత్సరానికి నియమితులయ్యారు. ఆయన తన గ్రాడ్యుయేషన్ బీకాంలో కాకతీయ యూనివర్సిటీ టాపర్గా బంగారు పతకం సాధించి, తనకిష్టమైన చార్టర్డ్ అకౌంటెంట్ సాధించి విద్యార్ధి దశలోనే గుర్తింవు పొందారు.
2015లో వరంగల్ ఐసీఏఐ బ్రాంచ్ చైర్మన్గా, 2016 సంవత్సరానికిగాను ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ (న్యూఢిల్లీ) పబ్లిక్ రిలేషన్స్ కమిటీలో కో-ఆప్టెడ్ మెంబర్గా అత్యున్నత సేవలను అందించారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ టాక్స్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఇరు రాష్ట్రాల్లో విశేషమైన సేవలందిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన ఐసీఏఐ ఫిబ్రవరి 2020లో ముఖ్యమైన ఎస్ఆర్ఎస్బీను ఏర్పాటు చేసి, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ (ఎస్డీజీ) 2030 వైపుకు సంస్థలను మలిచి వాటి పురోగతిని వెల్లడించడానికి సమగ్ర, ప్రపంచస్థాయిలో, సులభంగా అర్థమయ్యే స్టాండర్డులను రూపొందించడం లక్ష్యంగా పని చేస్తోంది. ఈ బోర్డు ప్రముఖ సంస్థలు ఎస్ఈబీఐ, ఎంసీఏ, ఎన్ఐటీఐ ఆయోగ్లతో భాగస్వామ్యాలు ఏర్పరుచుకుంటూ నిరంతరం తులనాత్మకంగా వ్యవహరిస్తుంది.
ఈ బోర్డు ముఖ్యమైన లక్ష్యాలు..
నేటి ప్రపంచమంతా ఎదుర్కొంటున్న ప్రకృతి వాతావరణ సమతుల్యతల ఆడిట్ నిర్వహించి తగు విధంగా రిపోర్ట్స్ సమర్పించి కంపెనీలకు సంస్థలకు దేశ రాజధాని నుంచి వివిధ గ్రామస్థాయిల వరకు వారిని ప్రోత్సహించడం కోసం ప్రణాళికలు,
ప్రకృతి పర్యావరణం పరిరక్షణ కోసం సామాజిక బాధ్యతలతో పనిచేసే సంస్థలకు కంపెనీలకు అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమం.
హరిత విప్లవం కోసమై ప్రపంచ స్థాయిలో అధ్యయనం కావించి ఉత్తమ పద్ధతులను దేశానికి అందించటం.
కంపెనీలను సంస్థలను తగిన కార్యాచరణ కోసమై మార్గదర్శనం చేయడం.
సోషల్ స్టాక్ ఎక్స్చేంజిపై అవగాహన కార్యక్రమం..సీఏలకు శిక్షణ కార్యక్రమాలు
మొత్తంగా హరిత విప్లవం ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసమై ప్రపంచ స్థాయి నాణ్యమైన పద్ధతులను అవగాహన, సీఏల ద్వారా భారత దేశాన్ని హరితమయంగా న్యాయంగా బాధ్యతరహితంగా మార్చడం. తన నియామకంపై సంతోషం వ్యక్తం చేస్తూ సీఏ పీవీ నారాయణరావు మాట్లాడుతూ.. ఐసీఏఐ నుంచి ఈ ప్రతిష్టాత్మక నియామకం పొందడం నాకు గొప్ప గౌరవం. సస్టైనబిలిటీ రిపోర్టింగ్ భారతదేశంలో పారదర్శక, బాధ్యతావంతమైన కార్పొరేట్ వ్యవస్థకు చాలా ముఖ్యం. ఈ బోర్డుకు నా అనుభవం, అంతర్దృష్టులతో సహకరిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ర్టంలో ఉన్న చార్టర్డ్ అకౌంటెట్స్ అభిమానం వారి సహకారంతో ఇతర బోర్డు సభ్యుల సమైక్య కృషితో ప్రణాళికాబద్ధంగా బోర్డు లక్ష్యాల మేరకు శాయశక్తులా ప్రయత్నిస్తానని వారు తెలిపారు.
Mangli | మైక్రో ఫైనాన్స్ మోసాలపై సింగర్ మంగ్లీ క్లారిటీ.. నా పేరుతో డబ్బులు వసూలు చేస్తే నమ్మోద్దు..
Iran: మేం కూడా పవర్ ప్లాంట్లను ధ్వంసం చేస్తాం: ఇరాన్ వార్నింగ్