Pakistan Super League: వార్నర్, స్టీవ్ స్మిత్‌కు బెదిరింపులు.. విదేశీ క్రికెటర్లకు పాక్ ఉగ్రసంస్థ వార్నింగ్
Pakistan Super League: విదేశీ క్రికెటర్లకు పాక్ ఉగ్రసంస్థ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ టోర్నీలో ఆడవద్దు అని హెచ్చరించింది. మార్చి 26వ తేదీ నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్ క్రికెట్ టోర్నీ జరగాల్సి ఉన్నది.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ సూపర్ లీగ్(Pakistan Super League) టీ20 టోర్నమెంట్ నిర్వహణ ఆగమ్యగోచంగా ఉంది. ఆ టోర్నీ జరుగుతుందో లేదో ఇంకా తెలియడం లేదు. అయితే ఆ టోర్నీలో పాల్గొనేందుకు వస్తున్న విదేశీ క్రికెటర్లకు బెదిరింపులు వస్తున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ఓ సాయుధ గ్రూపు తాజాగా వార్నింగ్‌లు జారీ చేసింది. విదేశీ ఆటగాళ్లను పంపవద్దు అని బోర్డులకు హెచ్చరిక చేసింది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్న ఆసీస్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌కు సాయుధ గ్రూపు వార్నింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. మార్చి 26వ తేదీ నుంచి పీఎస్ఎల్ను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
పాకిస్థాన్‌కు క్రికెటర్లను పంపవద్దు అంటూ సంబంధిత బోర్డులకు సలహా ఇస్తున్నామని, ఒకవేళ వాళ్లకు ఏదైనా జరిగినా, అది తమ బాధ్యత కాదు అని, మేం ముందే వార్నింగ్ ఇస్తున్నామని తెహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) సీనియర్ కమాండర్ అసద్ మన్సూర్ తెలిపారు. సోషల్ మీడియా టీటీపీ కమాండర్ జారీ చేసిన వార్నింగ్ వైరల్ అవుతోంది. పీఎస్ఎల్లో విదేశీ ప్లేయర్లు పాల్గోవద్దు అని హెచ్చరిక చేశారు. పీఎస్ఎల్ ఫ్రాంచైజీ కరాచీ కింగ్స్ తరపున డేవిడ్ వార్నర్ సారధ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక ఈ టోర్నీలో తొలిసారి స్టీవన్ స్మిత్ అరంగేట్రం చేయనున్నాడు. అతను ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆడనున్నాడు.
తాజా సమాచారం ప్రకారం స్మిత్ ఇప్పటికే పాకిస్థాన్‌కు బయలుదేరినట్లు తెలుస్తోంది. వార్నర్, స్మిత్ తో పాటు పీఎస్ఎల్లో ఆడే విదేశీ క్రికెటర్లలో మార్నస్ లబుషేన్, మొయిన్ అలీ, డేవాన్ కాన్వే, ఆడమ్ జంపా ఉన్నారు. ఈసారి టోర్నీ మొత్తాన్ని కేవలం రెండు వేదికల్లో నిర్వహించనున్నట్లు పీసీబీ చైర్మెన్ మోషిన్ నఖ్వీ తెలిపారు. పశ్చిమాసియా ఇంధన సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మార్చి 26వ తేదీన ప్రారంభం అయ్యే టోర్నీలో మొత్తం 44 మ్యాచ్‌లు ఆడనున్నారు. లాహోర్, కరాచీ వేదికల్లో ఆ మ్యాచ్‌లు ఉంటాయి. ఓపెనింగ్ సెర్మనీని కూడా రద్దు చేశారు. మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించబోమన్నారు.
🔴 JUST IN 🇵🇰
Armed opposition groups in Pakistan have issued a statement urging all foreign players participating in the Pakistan Super League (PSL) cricket matches to avoid traveling to Pakistan, stating that their security is not guaranteed and there is a risk of harm.
The… pic.twitter.com/caf7Tim1ep— Islamabad Post (@ISBPost) March 23, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

