Mangli | మైక్రో ఫైనాన్స్ మోసాలపై సింగర్ మంగ్లీ క్లారిటీ.. నా పేరుతో డబ్బులు వసూలు చేస్తే నమ్మోద్దు..
Mangli | ప్రఖ్యాత ఫోక్ సింగర్ మంగ్లీ పేరుతో మైక్రో ఫైనాన్స్ వ్యాపారం జరుగుతోందని వస్తున్న వార్తలపై ఆమె ఘాటుగా స్పందించారు. తనకు అలాంటి ఎలాంటి వ్యాపారాలతో సంబంధం లేదని స్పష్టం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Mangli | ప్రఖ్యాత ఫోక్ సింగర్ మంగ్లీ పేరుతో మైక్రో ఫైనాన్స్ వ్యాపారం జరుగుతోందని వస్తున్న వార్తలపై ఆమె ఘాటుగా స్పందించారు. తనకు అలాంటి ఎలాంటి వ్యాపారాలతో సంబంధం లేదని స్పష్టం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కొందరు వ్యక్తులు మంగ్లీ పేరును ఉపయోగిస్తూ మైక్రో ఫైనాన్స్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, “నా పేరుతో డబ్బులు సేకరిస్తున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యం. నాకు ఆ వ్యక్తులతో గానీ, వారి ఫైనాన్స్ వ్యాపారాలతో గానీ ఎలాంటి సంబంధం లేదు” అని తెలిపారు.
మంగ్లీ తన ప్రకటనలో , తనను మరియు తన కుటుంబ సభ్యులను చాలా మంది ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం సంప్రదిస్తుంటారని చెప్పారు. అయితే, ఆ ఈవెంట్స్‌కు సంబంధించిన ఆహ్వానాల వరకే తమకి పరిచయం ఉంటుందని, వారి వ్యక్తిగత వ్యాపారాల గురించి తాము ఎలాంటి బాధ్యత వహించబోమని స్పష్టం చేశారు. అలాగే, తన పేరును ఉపయోగించి మోసాలకు పాల్పడటం అన్యాయమని, ఇది తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరెన్సీ వీడియోలు, ఫైనాన్స్ వ్యవహారాలకు తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఆమె మరోసారి క్లియర్ చేశారు.
నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ తప్ప నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. ఎవ్వరైనా నా పేరు చెప్పి డబ్బులు అడిగితే దయచేసి నమ్మకండి. అలాంటి మోసాలకు గురైన వారికి న్యాయం చేయాలని పోలీస్ శాఖను కోరుతున్నాను అని మంగ్లీ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రకటనతో, మంగ్లీ పేరును వాడుకొని జరుగుతున్న మోసాలపై ప్రజల్లో అవగాహన పెరిగే అవకాశం ఉంది. ఇకపై ఇలాంటి ఘటనలపై జాగ్రత్తగా ఉండాలని ఆమె అభిమానులకు సూచించారు.ఇక ఇదిలా ఉంటే ఇటీవల మంగ్లీ పాన్-ఇండియా చిత్రం KD: ది డెవిల్ సినిమా కోసం ఒక పాట పాడింది. ‘సర్కే చునర్ తేరి సర్కే’ పాటలో డబుల్ మీనింగ్ లిరిక్స్ ఉన్నాయనే ఆరోపణలతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.ఈ క్రమంలో మంగ్లీ సోషల్ మీడియాలో స్పందిస్తూ… ‘ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ ఈ పాటను తొలగించాం. అనుకోకుండా జరిగిన పొరపాటుకు హృదయపూర్వక క్షమాపణలు’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

