జయశంకర్ భూపాలపల్లి : సింగరేణిలో(Singareni) కాంట్రాక్టుల పేరిట వేలకోట్ల దోపిడీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రధాన రహదారిపై బైఠాయించారు. సుమారు గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇవి కూడా చదవండి..
Chiru 158 | చిరంజీవి–బాబీ కొల్లి కాంబోపై అంచనాలు .. కృతి శెట్టి పాత్రపై తొలగిన అనుమానాలు
Yellamma | ‘బలగం’ తర్వాత వేణు నుంచి ‘ఎల్లమ్మ’.. దేవత పాత్రపై ఆసక్తికర చర్చలు