Yellamma |టాలీవుడ్లో ‘బలగం’ సినిమాతో ఒక్కసారిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆయన తెరకెక్కించనున్న తాజా చిత్రం ‘ఎల్లమ్మ’. గత కొంతకాలంగా ఈ సినిమాపై ఎన్నో రూమర్స్ వినిపించగా, తాజాగా విడుదలైన టీజర్‌తో కీలక విషయాలు అధికారికంగా వెల్లడయ్యాయి.ఈ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ (DSP) హీరోగా పరిచయం కాబోతుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ‘ఎల్లమ్మ’ అనే టైటిల్‌కు తగ్గట్టుగానే, తెలంగాణలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే ఎల్లమ్మ దేవత చుట్టూ సాగే కథగా ఈ సినిమా రూపొందుతున్నట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.
సినిమా విషయానికి వస్తే, దర్శకుడు వేణు సుమారు 8 గంటల పాటు కథను దేవిశ్రీప్రసాద్‌కు వివరించారట. కథలోని భావోద్వేగం, ఇంటెన్సిటీ, తెలంగాణ సెంటిమెంట్ DSPను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాలో నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. టీజర్లో దేవిశ్రీప్రసాద్ ‘పర్శి’ అనే మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఆయన లుక్, బ్యాక్‌డ్రాప్, డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే, ఈ చిత్రంలో రెగ్యులర్ హీరోయిన్ పాత్ర ఉండదట. మొత్తం కథనం అమ్మవారి చుట్టూనే తిరిగేలా ఉంటుందని టాక్. ఇది సాంప్రదాయ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా ఉండటం విశేషం.
ఈ నేపథ్యంలోనే ఎల్లమ్మ దేవత పాత్ర కోసం స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌ను సంప్రదించినట్లు ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ పాత్రకు ఆమె ఓకే చెబితే, దేవత పాత్రలో కీర్తి సురేష్, ఆమె భక్తుడి పాత్రలో దేవిశ్రీప్రసాద్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర కోసం దర్శకుడు వేణు ఇప్పటికే కీర్తి సురేష్‌తో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఆమె అంగీకారం లభిస్తే, త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ‘బలగం’లో గ్రామీణ వాతావరణం, తెలంగాణ సంస్కృతి, భావోద్వేగాలను అద్భుతంగా చూపించిన వేణు, ఇప్పుడు అదే తెలంగాణ సెంటిమెంట్‌ను మాస్ ఎలిమెంట్స్‌తో మేళవించి ‘ఎల్లమ్మ’ను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. భక్తి, భావోద్వేగం, సామాజిక అంశాల మేళవింపుతో ఈ సినిమా ఒక విభిన్న అనుభూతిని అందించనుందని అభిమానులు ఆశిస్తున్నారు.