Chiru 158 | మెగాస్టార్ చిరంజీవి తాజాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. ఈ సెన్సేషనల్ హిట్‌తో ఆయన మార్కెట్ మరింత బలపడగా, తదుపరి ప్రాజెక్టులపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా చిరంజీవి కెరీర్లో 158వ చిత్రంగా తెరకెక్కబోయే సినిమా ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ చిత్రానికి యువ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహించనున్న విషయం ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌ను ఎమోషనల్ డ్రామాతో మిళితం చేయడంలో బాబీకి ఉన్న అనుభవం కారణంగా, ఈ కాంబినేషన్‌పై ఇండస్ట్రీలో మంచి బజ్ ఏర్పడింది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికర రూమర్స్ వైరల్ అయ్యాయి.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి ఈ సినిమాలో చిరంజీవి కూతురు పాత్రలో నటించనుందన్న వార్తలు హల్చల్ చేశాయి. ‘బేబమ్మ’గా గుర్తింపు తెచ్చుకున్న కృతి శెట్టిని మెగాస్టార్ సినిమాలో కీలక పాత్రలో చూడబోతున్నామని అభిమానులు భావించారు. కానీ తాజాగా ఈ రూమర్స్‌పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది. కృతి శెట్టి ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాదని, ఆమె చిరంజీవి కూతురి పాత్రలో నటిస్తుందన్న ప్రచారం కేవలం గాసిప్ మాత్రమేనని తెలుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ ఎంపికపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇక సినిమాకి సంబంధించి ఇతర వివరాలు చూస్తే, బాబీ కొల్లి ఈ చిత్రాన్ని పూర్తిగా సాలిడ్ యాక్షన్ డ్రామాగా రూపొందించనున్నట్లు సమాచారం. చిరంజీవిని మాస్ అవతార్‌లో, పవర్ఫుల్ పాత్రలో చూపించేందుకు స్క్రిప్ట్‌ను డిజైన్ చేసినట్లు టాక్. అభిమానులు కోరుకుంటున్న వింటేజ్ మెగాస్టార్ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సులు ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట. ఈ చిత్రాన్ని కన్నడకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. త్వరలోనే షూటింగ్ షెడ్యూల్, నటీనటుల వివరాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.మొత్తంగా చూస్తే, చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్‌పై అంచనాలు రోజురోజుకు పెరుగుతుండగా, కృతి శెట్టి పేరుతో వచ్చిన రూమర్స్‌కు మాత్రం ఫుల్ స్టాప్ పడింది.