Shivala Marrichettu | ఐనవోలు (హనుమకొండ) : సుమారుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు ఇది.. శివాల మర్రికి ప్రదక్షణ అనంతరమే భక్తులు స్వామిని దర్శించుకోవడం అనవాయితీ.. అయితే కుండపోత వర్షానికి ఈ చెట్టు నేలకొరిగింది.
అతి పురాతన చరిత్ర కలిగిన ఆలయాల్లో ఐనవోలు మల్లికార్జునస్వామి ఒకటి. అటువంటి ఆలయ చరిత్రలో శివాలమర్రి చెట్టుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చే శివసత్తులు, భక్తులు ముందుగా శివాలమర్రి దగ్గర శివసత్తులు వేషధారణ వేసుకొని శివాలమర్రి చుట్టూ శివసత్తులు, భక్తులు ప్రదక్షిణ చేసిన తరువాతే స్వామి వారి దర్శనం చేసుకోవాలని భక్తుల నమ్మకం.
ఈ మర్రి చెట్టు సుమారుగా 100 సంవత్సరాల కంటే పైచిలుకు చరిత్ర కలిగిన చెట్టు అని వృద్ధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ చెట్టు ఐనవోలులో శుక్ర, శనివారం కురిసిన వర్షానికి నేల కొరిగింది. శివాల మర్రి చెట్టు నేలకొరగడంతో గ్రామస్తులు, మల్లన్న భక్తులు, ఆలయ అర్చకులు, ఆలయాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని శివాలమర్రి చెట్టుకు పునర్జీవం పోయాలని కోరుతున్నారు.
Koppula Eshwar | కర్ర శ్రీహరికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
Rayapole | ‘తాపీ కార్మిక సంఘం లేకపోవడంతో కార్మికులకు అనేక ఇబ్బందులు’
Nizampet | యూరియా కోసం బారులు తీరిన రైతులు