Urea | నల్లబెల్లి, జులై 20 : యూరియా కోసం అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. నల్లబెల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయానికి 800 యూరియా బస్తాలు వచ్చాయని సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటలకే పీఏసీఎస్ గోదాం ఎదుట యూరియా కోసం బారులు తీరారు. మహిళలు సైతం యూరియా కోసం క్యూ లైన్ కట్టారు.
అయితే పీఏసీఎస్ కార్యాలయంలో నానో యూరియా లింకు పెట్టకపోవడంతో యూరియా కోసం రైతులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. పరిస్థితి అదుపుతప్పడంతో ఎస్ఐ గోవర్ధన్, ఏవో బన్న రజితతోపాటు పోలీస్ సిబ్బంది గోదాం వద్దకు చేరుకొని యూరియా పంపిణీలో ఆలస్యం కాకుండా చర్యలు చేపట్టారు. యూరియా కొరత సందర్భంగా రేవంత్ సర్కారుపై శాపనార్ధాలు పెట్టడం కనిపించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు యూరియా కొరత ఏరోజు ఏర్పడలేదని వాపోయారు. అదేవిధంగా రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పలువురు రైతులు ఆరోపించారు.
Yellareddypet | పల్లెను మరిచిన ప్రభుత్వం.. గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం..
Siddaramaiah | డీకే శివకుమార్ పేరెత్తిన కార్యకర్త.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం సిద్ధరామయ్య
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి