వరంగల్ : వరంగల్ జిల్లా రాయపర్తి(Rayaparthi) మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో రెండు కిలోల ఎండు గంజాయిని స్వాధీనం(Seized marijuana) చేసుకున్నట్లు ఎస్ కొంగ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఒడిషా రాష్ట్రంకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో సిబ్బందితో కలిసి అతని వద్ద ఉన్న సంచులను పరిశీలించారు. అందులో సుమారు రెండు కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుగుతున్నట్లు వెల్లడించారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Ramesh Babu | కష్టకాలంలో ఏ ఒక్క హీరో పట్టించుకోలేదు.. నిర్మాత రమేశ్ బాబు షాకింగ్ కామెంట్స్
Delhi Elections | కొనసాగుతున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. 1 గంట వరకూ ఓటింగ్ శాతం ఇలా..