Ramesh Babu | కష్టకాలంలో తనను ఏ ఒక్క హీరో పట్టించుకోలేదని టాలీవుడ్ నిర్మాత రమేశ్ బాబు (Ramesh Babu) సంచలన కామెంట్స్ చేశారు. 2011లో గచ్చిబౌలిలో హైదరాబాద్ వ్యాపారవేత్తను బెదిరించి 12 కోట్లు స్వాహా చేసినట్టు రమేశ్ బాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. రమేశ్ బాబు ఈ కేసులో 78 రోజులు జైల్లో ఉన్నారు. అయితే ఈ కేసులో ఎలాంటి సాక్షాధారాలు లేకపోవడంతో 2025 జనవరి 31న రమేశ్ బాబును కోర్టు నిర్దోషిగా తేల్చింది.
ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్లో రమేశ్ బాబు చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. నా మీద అబద్దపు కేసులు వేశారు. 14 ఏండ్ల పాటు న్యాయపోరాటం చేసి.. ఇప్పుడు విజయం సాధించాను. అబద్దపు కేసులు ఎప్పుడూ నిలబడవు. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ల మీద న్యాయపోరాటం చేస్తాను. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్క హీరో నుంచి ఫోన్ చేయలేదు.. కనీసం పలుకరించలేదని రమేశ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
కొమురం పులి, ఖలేజా సినిమాలతో నాకు రూ.100 కోట్ల నష్టం వచ్చింది. ఏడాది చేయాల్సిన సినిమాలు మూడేళ్లు అయ్యాయని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి రమేశ్ బాబు కామెంట్స్‌పై ఇండస్ట్రీ నుంచి ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.
Sairam Shankar | విలన్ ఎవరో చెప్పండి.. రూ.10 వేలు గెలుచుకోండి.. సాయి రామ్ శంకర్ బంపర్ ఆఫర్
Pushpa 2 The Rule | పుష్పరాజ్ మేనియా కంటిన్యూ.. ఇక మరో భాషలో అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్..!
Thandel | తండేల్కు నాగచైతన్య, సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్స్.. ఎంతో తెలుసా..?