Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. సామాన్య ప్రజలతోపాటు పలువురు ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు పార్టీల నేతలు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 1 గంట వరకూ 33.31 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో 1.56 కోట్ల మందికిపైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఉవ్విళ్లూరుతుండగా.. 25 ఏండ్ల తర్వాత మళ్లీ ఢిల్లీ గద్దెనెక్కాలని బీజేపీ భావిస్తున్నది. ఈనెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
33.31% voter turnout recorded till 1 pm in #DelhiElection2025 pic.twitter.com/e4LOz4Yalf
— ANI (@ANI) February 5, 2025
Also Read..
Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటేసిన ప్రముఖులు
Rahul Dravid | నడిరోడ్డుపై ఆటో డ్రైవర్‌తో రాహుల్ ద్రవిడ్ వాగ్వాదం.. వీడియో వైరల్
Shantanu Naidu | రతన్ టాటా స్నేహితుడు శంతను నాయుడుకు టాటా మోటార్స్‌లో కీలక పదవి