Shantanu Naidu | దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata)కు అత్యంత ఆప్తుడు, టాటా ట్రస్ట్‌లో పిన్న వయస్కుడైన జనరల్ మేనేజర్‌గా, అసిస్టెంట్‌గా వ్యవహరించిన శంతను నాయుడు (Shantanu Naidu)కు సంస్థలో కీలక పదవి వరించింది. రతన్ టాటా మరణానంతరం శంతనుకు టాటా గ్రూప్ కీలక బాధ్యతలు అప్పగించింది. దేశీయ దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors)లో స్ట్రాటజిస్ట్ ఇనీషియేటివ్స్ విభాగానికి హెడ్, జనరల్ మేనేజర్‌గా నియమించింది. ఈ విషయాన్ని శంతను నాయకుడు స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
‘టాటా మోటార్స్‌లో జనరల్ మేనేజర్, హెడ్- స్ట్రాటజిక్ ఇనీషియేటివ్‌గా కొత్త ప్రయాణం మొదలు పెట్టినందుకు సంతోషంగా ఉంది. మా నాన్న టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి తెల్ల చొక్కా, నేవీ ప్యాంట్ వేసుకుని ఇంటికొచ్చేవారు. ఆయన కోసం కిటికీ వద్ద నిలబడి ఎదురు చూసేవాడిని. ఇప్పుడు లైఫ్ ఫుల్ సర్కిల్‌లోకి వచ్చింది’ అంటూ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో శంతను నాయుడు రాసుకొచ్చారు.
కాగా, 80 ఏళ్ల రతన్ టాటాకు.. శంతనుతో మంచి అనుబంధం ఏర్పడింది. 2018 నుంచి రతన్ టాటాకు శంతను అసిస్టెంట్‌గా ఉంటున్నారు. వీరిద్దరినీ కలిపింది వీధి శునకాలే. రతన్ టాటా, శంతను మధ్య భారీగా వయోబేధం ఉన్నా.. అది స్నేహానికి, వ్యాపారానికి ఏమాత్రం అడ్డుకోలేదు. ఒకరిపై మరొకరు చేతులు వేసుకుని మాట్లాడేంత సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరి బంధాన్ని అర్థం చేసుకున్నవారు ‘ఏజ్.. జస్ట్ ఎ నంబర్’ అని తేల్చేస్తారు.
వ్యాపారంతోపాటు సామాజిక సేవలోనూ పరిచయం అక్కర్లేని పేరు రతన్ టాటాది. అలాంటి వ్యాపార దిగ్గజం భుజంపై చేయి వేసి ‘ఇంకేంటి డ్యూడ్! ట్విటర్లో ఏం ట్వీటావు? ఇన్‌స్టాలో ఫాలోవర్స్ సంగతేంటి?’ అంటూ ఆప్యాయంగా పలకరించేంత చనువు, స్నేహం శంతనుకు మాత్రమే ఉంది. రతన్ సేవా కార్యక్రమాలు, ఆయన సోషల్ మీడియా ఖాతాల వెనుక ఈ 30 ఏండ్ల యువకుడి ప్రతిభా నైపుణ్యాలు ఉన్నాయి. రతన్ టాటా చివరి దశలో కేర్ టేకర్‌గా కూడా శంతను నాయుడు వ్యవహరించారు.
Also Read..
Tata Motors | టాటా కార్లపై భారీ డిస్కౌంట్.. ఏ మోడల్‌పై ఎంతంటే?
Companies Closed | 10 నెలల్లో 17,654 కంపెనీలు బంద్.. ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం