Tata Motors | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఎంపిక చేసిన మాడళ్లపై టాటా మోటర్స్ తాజాగా లక్ష రూపాయల వరకు తగ్గింపు ప్రకటించింది. వీటిలో టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, హరియర్, సఫారీ మాడళ్లున్నాయి. పెట్రోల్/సీఎన్జీ రకాల విషయానికొస్తే.. టియాగో మాడల్‌పై రూ.35 వేలు రాయితీ ఇస్తున్నది. రూ.20 వేలు కన్జ్యూమర్ డిస్కౌంట్, మరో రూ.15 వేలు ఎక్సేంజ్ డిస్కౌంట్లున్నాయి. ఇలాగే టిగోర్‌పై రూ.45 వేలు, ఆల్ట్రోజ్‌లో రేసర్ మినహా మిగతా వేరియంట్లపై రూ.65 వేలు, పంచ్‌పై రూ.25 వేలు, నెక్సాన్ మాడళ్లపై రూ.45 వేల రాయితీలున్నాయి.
ఇక ఎస్యూవీ మాడైళ్లెన హరియర్, సఫారీ అన్ని డీజిల్ వేరియంట్లపై రూ.75 వేల వరకు డిస్కౌంట్ వస్తున్నది. మరోవైపు, ఆల్ట్రోజ్, నెక్సాన్ డీజిల్ అన్ని రకాలపై 65వేలు, 45వేల చొప్పున డిస్కౌంట్లున్నాయి. అయితే ఆల్ట్రోజ్ పెట్రోల్ రేసర్ వేరియంట్‌పై గరిష్ఠంగా లక్ష డిస్కౌంట్ ఉన్నది. జనవరిలోనూ కంపెనీ రూ.85 వేల తగ్గింపునిచ్చినది తెలిసిందే.