Rahul Dravid | టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) నడిరోడ్డుపై ఓ ఆటో డ్రైవర్ (auto driver)తో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. మైదానంలో ఎంతో ప్రశాంతంగా కనిపించే ద్రవిడ్ ఇలా అసహనాన్ని ప్రదర్శించడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. రాహుల్ ద్రవిడ్ మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో బెంగళూరు (Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో కన్నింగ్‌హామ్ రోడ్డు (Cunningham Road)లో తన కారులో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో ద్రవిడ్ కారును ఓ ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. అయితే ద్రవిడ్ కారుకు స్వల్ప డ్యామేజీ అయ్యింది. దీంతో సహనం కోల్పోయిన ద్రవిడ్ వెంటనే కారు దిగి సదరు ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. కన్నడ భాషలో ఆటో డ్రైవర్‌పై అసహనాన్ని ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Rahul Dravid’s Car touches a goods auto on Cunningham Road Bengaluru #RahulDravid #Bangalore pic.twitter.com/AH7eA1nc4g
— Spandan Kaniyar ಸ್ಪಂದನ್ ಕಣಿಯಾರ್ (@kaniyar_spandan) February 4, 2025
Also Read..
Delhi Elections | ఓటేసిన అరవింద్ కేజ్రీవాల్.. 11 గంటల వరకూ ఓటింగ్ శాతం ఇలా..
IT Employee | మాదాపూర్‌లో బిల్డింగ్‌పై నుంచి దూకి ఐటీ ఉద్యోగి ఆత్మహత్య..
Bomb Threats | నోయిడాలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు