Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. సామాన్య ప్రజలతోపాటు పలువురు ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
#WATCH | #DelhiElection2025 | AAP national convener Arvind Kejriwal casts his vote at Lady Irwin Senior Secondary School. His parents, wife and son also cast their vote here.
The sitting MLA from New Delhi constituency faces a contest from Congress’ Sandeep Dikshit and BJP’s… pic.twitter.com/NMUXil4fWo
— ANI (@ANI) February 5, 2025
ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఓటు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్య సునీత కేజ్రీవాల్, కుమారుడు, తల్లిదండ్రులతో కలిసి లేడీ ఇర్విన్ సెకండరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. మరోవైపు ఉదయం 11 గంటల వరకూ 19.95 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
19.95% voter turnout recorded till 11 am in #DelhiElection2025 pic.twitter.com/4fNGZvHoBO
— ANI (@ANI) February 5, 2025
మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో 1.56 కోట్ల మందికిపైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఉవ్విళ్లూరుతుండగా.. 25 ఏండ్ల తర్వాత మళ్లీ ఢిల్లీ గద్దెనెక్కాలని బీజేపీ భావిస్తున్నది. ఈనెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read..
Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటేసిన ప్రముఖులు
Delhi Elections | కొనసాగుతున్న పోలింగ్.. ఢిల్లీలో 8 శాతం ఓటింగ్ నమోదు
PM Modi | ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొనండి.. ఢిల్లీ ఓటర్లకు సూచించిన ప్రధాని మోదీ