న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రధాని మోదీ (PM Modi) ట్వీట్ చేశారు. ఈ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య పండుగలో పూర్తి ఉత్సాహంతో పాల్గొని తమ విలువైన ఓటును వేయాలని కోరారు. ఓటింగ్లో కొత్త రికార్డును నెలకొల్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేవారు.
ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాలకు బుదవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1.56 కోట్ల మంది ఓట్లరు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. వీరికోసం 13,766 పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. త్రిముఖ పోరులో ఆప్, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొన్నది. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Prime Minister Narendra Modi tweets “Voting for all the seats in the Delhi Assembly elections will be held today. I urge the voters here to participate in this festival of democracy with full enthusiasm and cast their valuable votes. On this occasion, my special wishes to all… pic.twitter.com/r03wQ3rtd9
— ANI (@ANI) February 5, 2025