Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Election 2025) పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలో 8 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు 8.10 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో 1.56 కోట్ల మందికిపైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఉవ్విళ్లూరుతుండగా.. 25 ఏండ్ల తర్వాత మళ్లీ ఢిల్లీ గద్దెనెక్కాలని బీజేపీ భావిస్తున్నది. ఈనెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read..
Aga Khan | ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ కన్నుమూత
PM Modi | ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొనండి.. ఢిల్లీ ఓటర్లకు సూచించిన ప్రధాని మోదీ
By-Elections | రెండు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్