By-Elections | రెండు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు మరో రెండు రాష్ట్రాల్లో ఉపఎన్నికల (By-Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్, తమిళనాడులోని ఈరోడ్ (ఈస్ట్) నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు మరో రెండు రాష్ట్రాల్లో ఉపఎన్నికల (By-Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్, తమిళనాడులోని ఈరోడ్ (ఈస్ట్) నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ రాజీనామాతో యూపీలోని మల్కిపురిలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన మిల్కిపూర్ నుంచి గత ఎన్నికల్లో అవదేశ్ ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఫైజాబాద్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపఎన్నిక పోలింగ్ బుధవారం జరుగుతున్నది. నియోజకవర్గంలో 3,70,829 మంది ఓటర్లు ఉన్నారు. 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ.. అధికార బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నది.
ఇక కాంగ్రెస్ నేత ఈవీకేఎస్ ఇలాంగోళవన్ మృతితో తమిళనాడులోని ఈరోడ్ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరుగుతున్నది. డీఎంకే తరఫున వీసీ చంద్రకుమార్ పోటీచేస్తుండగా, అన్నాడీఎంకే, బీజేపీలు ఆయనకు సవాల్ విసురుతున్నాయి. మొత్తం 46 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో 2.28 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీతోపాటు ఉపఎన్నికల ఫలితాలు కూడా ఈ నెల 8న వెలువడనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

