Bomb Threats | ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపాయి. ఇవాళ ఉదయం నాలుగు ప్రైవేట్ స్కూల్స్‌కు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను బయటకు పంపించారు (students evacuated).
నోయిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం స్టెప్ బై స్టెప్ స్కూల్, ది హెరిటేజ్ స్కూల్ నోయిడా, జ్ఞానశ్రీ స్కూల్, మయూర్ స్కూల్‌కు ఈ బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యాలు వెంటనే విద్యార్థులను స్కూల్ ఆవరణ నుంచి బయటకు పంపించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, అగ్నిమాపక దళంతో స్పాట్‌కు చేరుకున్నారు. ఆయా పాఠశాలల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదు. ఈ బెదిరింపులు అంతా బూటకమని ప్రాథమిక విచారణలో తేల్చారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈమెయిల్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వారిని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read..
PM Modi | మహాకుంభమేళా.. త్రివేణీ సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానాలు
Right to Information | అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతున్న సమాచార హక్కు చట్టం
Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటేసిన ప్రముఖులు