కేసముద్రం, మే 5 : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పసుపు రికార్డు స్థాయిలో ధర పలికింది. జూన్‌లో సాగుచేసిన పసుపు పంట రైతులకు ప్రస్తుతం చేతికొస్తుండడంతో మార్కెట్‌కు విక్రయానికి తీసుకొస్తున్నారు. సోమవారం మార్కెట్‌కు 340 బస్తాల పసుపు రాగా, కాడి రకానికి క్వింటాకు గరిష్ఠంగా రూ.13,852, కనిష్ఠంగా రూ.11,452, గోల రకానికి గరిష్ఠంగా రూ.12,051, కనిష్ఠంగా రూ.7,000 పలికింది. గతేడాది క్వింటాకు రూ.7,000 పలికిన పసుపు ధర ఈ ఏడాది రూ.13వేల పైచిలుకు పలుకుతున్నది. అయితే సాగు విస్తీర్ణం పూరిగా పడిపోవడం కారణంగానే పసుపు ధర పెరుగుతున్నదని వ్యాపారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Donald Trump | సిక్స్‌ప్యాక్‌తో ట్రంప్.. హాలీవుడ్ యాక్షన్ హీరోలా దర్శనమిచ్చిన అధ్యక్షుడు
Chenab River | పాక్‌కు చీనాబ్ నీళ్లు బంద్.. సలాల్ జలాశయం గేట్లు మూసివేత.. VIDEOS
Red Fort: ఎర్రకోటపై దావా వేసిన మొఘల్ వారసురాలు.. పిటీషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు