Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కొత్త అవతారంలో నెటిజన్లకు షాక్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం క్యాథలిక్ మతపెద్ద పోప్ అవతారమెత్తి అందరినీ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. తాజాగా సిక్స్ ప్యాక్‌తో హాలీవుడ్ యాక్షన్ హీరోలా దర్శనమిచ్చారు. మే4న స్టార్ వార్స్ డే (Star Wars Day) సందర్భంగా అధ్యక్షుడు ఈ విధంగా దర్శనమిచ్చారు. అయితే, ఇది నిజమైన ఫొటోకాదు. ఏఐ ద్వారా రూపొందించిన చిత్రం. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
పోప్ ట్రంప్..
కాగా, క్యాథలిక్ క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లోనూ ట్రంప్ పాల్గొన్నారు. అయితే ఓ టీవీ రిపోర్టర్ వేసిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ తాను పోప్ కావాలనుకుంటున్నానని, అదే తన నెంబర్ వన్ ఛాయిస్ అంటూ జోక్ వేశారు. అధ్యక్షుడి వ్యాఖ్యల నేపథ్యంలో ‘పోప్ ట్రంప్’ ఫొటో బయటకు వచ్చింది. ఏఐ ద్వారా రూపొందించిన ఈ ఫొటోను అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ పొటోపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ మరణాన్ని ట్రంప్ అపహాస్యం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.
Also Read..
Donald Trump | ట్రంప్ సంచలన ప్రకటన.. విదేశీ సినిమాలపై 100 శాతం టారిఫ్‌లు
Donald Trump | మూడోసారి పోటీచేసే యోచన లేదు: డొనాల్డ్ ట్రంప్