Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పాలనలో దూకుడు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగుల తొలగింపులు, సుంకాల మోత వంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్న ట్రంప్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి ఆయన సినిమా పరిశ్రమపై పడ్డారు. అమెరికాలో విడుదల చేసే విదేశీ సినిమాలపై 100 శాతం టారిఫ్లు (100 Percent tariff) విధించనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
విదేశీ సినిమాల వల్ల హాలీవుడ్ నష్టపోతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా బయట షూటింగ్ చేసి తమ దేశంలో రిలీజ్ చేసే అన్ని రకాల సినిమాలపై వంద శాతం పన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో సినీ పరిశ్రమ వేగంగా పతనమవుతోందని ఈ సందర్భంగా ట్రంప్ అన్నారు. ఇతర దేశాలు ఒక్కటైన హాలీవుడ్ను నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. దర్శక, నిర్మాతలు, స్టూడియోలను అమెరికా నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
ఇందుకోసం అన్ని రకాల ప్రోత్సహకాలను అందిస్తున్నాయన్నారు. ఈ కారణంగా హాలీవుడ్ నాశనమవుతోందని వ్యాఖ్యానించారు. ఇది దేశ భద్రతకు ముప్పుగా (national security) అభివర్ణించారు. అందుకే విదేశాల్లో నిర్మించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై వంద శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించేలా వాణిజ్య శాఖను ఆదేశిస్తున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read..
Tangmarg | ఉగ్రవాదులకు సాయం చేసి.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకి వ్యక్తి మృతి
Fire Accident | కాన్పూర్లో భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం
Jaikrishn Patel | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మెల్యే..