Tangmarg | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఓ వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కుల్గాం జిల్లాలో చోటు చేసుకుంది. సదరు వ్యక్తి నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా అతడి మృతదేహాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులకు 23 ఏళ్ల ఇంతియాజ్ అహ్మద్ (Imitiaz Ahmad) సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడు. కుల్గాంలోని టాంగ్మార్గ్ (Tangmarg)లో ఉన్న అడవిలో నక్కిన టెర్రరిస్టులకు తాను ఆహారం, ఆశ్రయంతో పాటు ఇతర సహాయం చేసినట్లు అంగీకరించాడు. అంతేకాదు ఉగ్రవాదుల ఉన్న ప్రాంతాన్ని చూపిస్తానంటూ పోలీసులను నమ్మించాడు. దీంతో పోలీసులు, ఆర్మీ బలగాలు ఆదివారం ఉదయం ఇంతియాజ్‌ను తీసుకొని అటవీ ప్రాంతం వైపు వెళ్లారు. ఈ క్రమంలో మార్గం మధ్యలో ఇంతియాజ్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వేషా నదిలోకి దూకేశాడు. ఈ క్రమంలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు.
అతడి మృతితో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే అతడిని చంపేశారంటూ ఆరోపించారు (custodial death). జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సైతం ఆరోపణలు చేశారు. పోలీసులు విచారణకు తీసుకెళ్లిన యువకుడు నదిలో శవమై తేలాడని అన్నారు. ఇంతియాజ్ మృతిలో కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి తప్పించుకునే క్రమంలో నదిలోకి దూకినట్లు ఓ వీడియో ద్వారా వెల్లడైంది. ఎవరి ప్రమేయం లేకుండా ఇంతియాజ్ నదిలోకి దూకుతున్నట్లు ఉన్న వీడియో బయటకు రావడంతో ఈ ఘటనలో పోలీసుల ప్రమేయం లేదని తేలింది. మరోవైపు నదిలో నుంచి మృతదేహాన్ని అధికారులు బయటకు తీశారు.
Also Read..
Fire Accident | కాన్పూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం
Jaikrishn Patel | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మెల్యే..
Pakistan | భారత్‌తో యుద్ధం వస్తే 4 రోజుల్లో ఖాళీ.. పాక్ వద్ద అడుగంటిన ఫిరంగి గుండ్లు!