Donald Trump | వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవి కోసం మూడోసారి పోటీ చేసే యోచన లేదని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఎన్బీసీ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, దాని గురించి తాను ఆలోచించడం లేదన్నారు. నాలుగేళ్లు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ ఫలితాలను గొప్ప రిపబ్లికన్‌కు అందజేయాలని, ఆ గొప్ప రిపబ్లికన్ దానిని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానని చెప్పారు.