ట్రావెల్ అడ్వెంచరస్ టాక్‌షో ‘సోల్ ట్రిప్’ మొదటి సీజన్ త్వరలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నది. ఈ షోలో జగపతిబాబు, శ్రీకాంత్, అలీ వంటి నటులు భాగం కాబోతున్నారు. గండభేరుండ ఆర్ట్స్ పతాకంపై విజయ్ దాట్ల ఈ టాక్‌షోను రూపొందిస్తున్నారు. శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. తనకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని, వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడి సంస్కృతికి తగిన విధంగా బతకడమనే కాన్సెప్ట్ బాగా నచ్చిందన్నారు. గోవాలో అక్కడి లోకల్ వారితో చేసిన ఇంటర్వ్యూలు ఈ షోలో హైలైట్‌గా ఉంటాయన్నారు. విహార యాత్రల్లో ప్రకృతితో పాటు అక్కడి కల్చర్‌తో మమేకమైనప్పుడే ఎన్నో విషయాలను నేర్చుకోగలమని టాక్‌షో దర్శకుడు విజయ్ దాట్ల తెలిపారు. ఈ టాక్‌షోకు సాహిత్య సాగర్ సంగీతాన్నందిస్తున్నారు.