హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): దివంగత నల్లమల గిరిప్రసాద్ సతీమణి నల్లమల కమలాదేవి (87) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల సందర్శనార్థం ఆమె పార్ధివదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని పెద్ద కుమార్తె ఇంట్లో ఉదయం ఉంచారు.
అనంతరం సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, రాష్ట్ర కారవర్గ సభ్యురాలు ఎస్ ఛాయాదేవి, రాష్ట్ర నాయకులు ప్రేమ పావని సంతాపం తెలిపారు.