వాజేడు, మే, 30 : ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగార బొగత జలపాతం(Bogotha Waterfall) ఆదివారం పర్యాటకులతో(Tourists )పోటెత్తింది. బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుతున్నది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా.. ఆంధ్ర రాష్ట్రం, ఛతీస్ గడ్ రాష్ట్రాల నుండి కూడా పర్యాటకులు అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు. సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
ఇది కూడా చదవండి..
Supreme court: ఆ వీడియో డిలీట్ చేయండి.. జర్నలిస్టుకు సుప్రీం ఆదేశం
Ram Kadam | ఆ ఇద్దరు శివసేన నేతలను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి : బీజేపీ