Bangladesh President : బంగ్లాదేశ్లో తారీక్ రెహ్మాన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ఆ దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏడాదిన్నర కాలంగా వెలుగులోకి రాని ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ (Mohammad Shahabuddin)స్వేచ్ఛను పొందారు. భారత్తో ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు బంగ్లాదేశ్ సిద్ధమవుతున్న వేళ.. షహబుద్దీన్ మధ్యంతర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ యూనుస్పై విమర్శలు గుప్పించారు. యూనుస్ ప్రభుత్వం చీకట్లోకి నెట్టేసిన తీరును వెల్లడించిన ఆయన.. యూనుస్ పలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు.
ఏడాది క్రితం షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనుస్ హయాంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. 2024 ఆగస్టు 28న అధ్యక్షుడు షహబుద్దీన్ స్వయంగా యూన్స్తో ప్రమాణస్వీకారం చేయించారు. అయితే.. ఆ తర్వాత నుంచి యూనుస్ అరాచకాలు పెరిగిపోయాయని.. కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ నేషనల్ ఫ్రంట్ మద్దతుతో తాను ఈ విషయాలు వెల్లడిస్తున్నాని ఆయన అన్నారు.
🚨 BIG! Bangladesh President accuses Mohd Yunus of BYPASSING the Constitution
— He has claimed Yunus undertook 14 to 15 foreign trips WITHOUT INFORMING the President about the visits or their outcomes🤯
• Allegations made:
– No prior intimation of foreign travel
– No briefing… pic.twitter.com/ocsjxdfWOp— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) February 23, 2026
‘ముఖ్య సలహాదారుగా యూనుస్ రాజ్యంగాన్ని పాటించలేదు. ఆయన తీసుకున్న చర్యలన్నీ చట్ట వ్యతిరేకమే. అమెరికాతో బంగ్లాదేశ్ కుదుర్చుకున్న వ్యాపార ఒప్పందం గురించీ నాకు తెలియదు. యూనుస్ ఏడాదిన్నర కాలంలో 14-15 సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. కానీ, నాతో ఒక్క మాట చెప్పలేదు. నన్ను విదేశాలకు వెళ్లకుండ రెండుసార్లు అడ్డుకున్నారు. మధ్యంతర ప్రభుత్వం నా పేరు బయటకు రాకుండా. ప్రజలకు నేను చేరువకాకుండా చేసింది. చెప్పాలంటే నన్ను చీకట్లోకి నెట్టేశారు’ అని షహబుద్దీన్ వాపోయారు. అయితే.. తాజా ప్రధాని తారీక్ రెహ్మాన్ మాత్రం తనను మంచి వ్యక్తిగా పేర్కొంటూ.. మద్ధతుగా నిలుస్తున్నారని ఆయన వెల్లడించారు. రెండేళ్ల క్రితం మధ్యంతర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన యూనుస్.. ఫిబ్రవరి 16 వరకూ అనధికారిక ప్రధానిగా కొనసాగిన విషయం తెలిసిందే.