Supreme court: ఆ వీడియో డిలీట్ చేయండి.. జర్నలిస్టుకు సుప్రీం ఆదేశం
Supreme court: రిటైర్డ్ జడ్జీ బేలా ఎం త్రివేదిపై వివాదాస్పద వీడియోను పోస్టు చేశారు జర్నలిస్టు అజయ్ శుక్లా. ఆ వీడియోను తక్షణమే డిలీట్ చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబర్ శుక్లాపై సుమోటో కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ: యూట్యూబర్, జర్నలిస్టు అజయ్ శుక్లాపై సుమోటో కేసు నమోదుకు సుప్రీంకోర్టు(Supreme court) ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాదిపై ఇటీవల శుక్లా తన యూట్యూబ్ ఛానల్లో వివాదాస్పద వీడియోను పోస్టు చేశారు. సీనియర్ జడ్జిని కించపరిచే విధంగా ఉన్న ఆ వీడియోను డిలీట్ చేయాలని సుప్రీం ఆదేశించింది. సీజే బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మాషి, ఏఎస్ చందూర్కర్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఇలాంటి కాంటెంట్‌ను మళ్లీ యూట్యూబ్‌లో అప్లోడ్ చేయరాదు అని కోర్టు ఆదేశించింది.
వరప్రద మీడియాకు ఎడిటర్ అయిన శుక్లాకు నోటీసులు కూడా ఇచ్చింది. సీనియర్ జడ్జిపై యూట్యూబర్ శుక్లా చేసిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. శుక్లాపై సుమోటో కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. యూట్యూబ్‌లో చేసిన ఆరోపణలతో న్యాయ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని, రాజ్యాంగం భావ స్వేచ్ఛను కల్పిస్తున్నదని, కానీ దానికి నిబంధనలు ఉన్నాయని, అత్యున్నత న్యాయస్థానానికి చెందిన జడ్జీని కించపరిచే రీతిలో ఆరోపణలు చేయడం సరైంది కాదు అని, ఇది ధిక్కరణ అవుతుందని, న్యాయ వ్యవస్థకు చెడు పేరు వస్తుందని సీజేఐ తెలిపారు.
జర్నలిస్టు శుక్లా ఇటీవల రిటైర్డ్ జడ్జీ బేలా ఎం త్రివేదిపై వివాదాస్పద వీడియోను పోస్టు చేశారు.
Read More..
కరడుగట్టిన ఉగ్రవాదులు మసూద్ అజార్, హఫీజ్ సయీద్‌ను అప్పగించండి.. పాక్‌కు రాజ్‌నాథ్ కీలక హెచ్చరికలు
4 ఏళ్ల ఐపీఎల్ స్టార్‌ను కలిసిన ప్రధాని మోదీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

