Rajnath Singh | ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం సైనిక చర్య మాత్రమే కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. అది ఉగ్రవాదంపై మూకుమ్మడి దాడి అని పేర్కొన్నారు. పాక్ ఉగ్రవాదులను నాశనం చేసేందుకు ఏ పద్ధతినైనా అనుసరిస్తామన్నారు. పాక్ ఊహించలేని పద్ధతుల్లో ఆ చర్యలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పాకిస్థాన్ ఆడుతున్న ప్రమాదకర ఉగ్రవాద ఆట ఇప్పుడు ముగిసిందని వ్యాఖ్యానించారు.
యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా పాక్ (Pakistan)కు కీలక హెచ్చరికలు జారీ చేశారు. తమ గడ్డపై ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ నిర్మూలించాలని హెచ్చరించారు. పాకిస్థాన్ చర్చలకు సిద్ధంగా ఉంటే ముందు ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలన్నారు. కరడుగట్టిన టెర్రరిస్ట్‌లు మసూద్ అజార్ (Masood Azhar), హఫీజ్ సయీద్ (Hafiz Saeed)ను భారత్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు. భారత నౌకాదళం పరాక్రమాన్ని పాకిస్థాన్ ఇంకా చూడలేదని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. సమగ్రమైన రీతిలో సాగిన ఆపరేషన్‌లో భారతీయ నౌకాదళ పాత్ర కూడా అద్భుతమైందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. పాకిస్థానీ నేలపై ఉన్న ఉగ్ర స్థావరాలను ఐఏఎఫ్ ధ్వంసం చేస్తే, ఆరేబియా సముద్రంలో ఉన్న భారత యుద్ధ నౌకలు.. పాకిస్థానీ నేవీని తీరానికి పరిమితం చేశాయన్నారు.
Also Read..
Bank Frauds: బ్యాంక్ మోసాలు పెరిగిపోతున్నాయి.. మోదీని టార్గెట్ చేసిన ఖర్గే
Kamal Haasan | తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతాను.. కన్నడ భాష వివాదంపై కమల్ హాసన్
Tiger | టూరిస్ట్‌పై దాడి చేసిన పులి.. షాకింగ్ వీడియో వైరల్