Tiger | థాయ్‌లాండ్ (Thailand) పర్యటనకు వెళ్లిన ఓ భారతీయుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అక్కడి ఫేమస్ టైగర్ కింగ్డమ్ (Tiger Kingdom)లో పులి (Tiger) అతడిపై దాడి చేసింది. ఈ ఘటనలో సదరు టూరిస్ట్‌కు గాయాలయ్యాయి.
థాయ్‌లాండ్‌లోని పుకెట్ (Phuket) దీవులకు వెళ్లిన భారత్‌కు చెందిన ఓ యువకుడు.. అక్కడి ఫేమస్ టైగర్ కింగ్డమ్ను సందర్శించాడు. అక్కడ పులితో సరదాగా గడిపాడు. ఈ క్రమంలో దాంతో సెల్ఫీ తీసుకునేందుకు పులి పక్కన కూర్చోగా అది ఒక్కసారిగా గాండ్రించింది. ట్రైనర్ ఎదుటే అతడిపై దాడి చేసింది. ఊహించని ఈ ఘటనతో అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పులి దాడిలో అతడికి గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో (terrifying video) ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Apparently an Indian man attacked by a tiger in Thailand.
This is one of those paces where they keep tigers like pets and people can take selfies, feed them etc etc.#Indians #tigers #thailand #AnimalAbuse pic.twitter.com/7Scx5eOSB4
— Sidharth Shukla (@sidhshuk) May 29, 2025
Also Read..