మహబూబాబాద్ : మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఓ రోగి మూడో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతుడు జిల్లాలోని ఇనుగుర్తి మండలం చిన్న నాగారం చెందిన నాయిని ఐలయ్యగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇవి కూడా చదవండి..
Allu Arjun | ఎయిర్‌పోర్ట్‌లో బన్నీకి చుక్కలు చూపించిన అధికారి.. వైరల్ అవుతున్న వీడియో
LGBT Apps | కవ్వించి.. హోటల్‌కు రప్పించి! నగ్నవీడియోలతో బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్న మోసగాళ్లు..
Hyderabad | సిటీకి సీజనల్ ముప్పు.. మొదలైన దోమల బెడద, విష జ్వరాలతో అల్లాడుతున్న నగరవాసులు