Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. పుష్ప చిత్రంతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగింది. ఆయనకి దేవ విదేశాలలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ముంబై విమానాశ్రయంలో బన్నీకి ఘోర అవమానం జరిగింది. చెకింగ్ దగ్గర మాస్క్ పెట్టుకున్న బన్నీని గుర్తు పట్టని అధికారి మాస్క్ తీయమని అడిగాడు. తొలుత ఆయన నిరాకరించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత తన గ్లాస్, మాస్క్ తీసి ఫేస్ చూపించాడు. దాంతో బన్నీని లోపలికి పంపారు ఆ అధికారి. అయితే దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. బన్నీకి నెగెటివ్‌గా కొందరు కామెంట్స్ చేస్తుంటే, వాటిని మరి కొందరు తిప్పి కొడుతున్నారు. ప్రస్తుతం బన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఇక పుష్ప చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ అందిపుచ్చకున్న బన్నీ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో మరో భారీ చిత్రం చేస్తున్నాడు.. AA 22 (వర్కింగ్ టైటిల్)గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్రలకు సంబంధించి కొన్ని రోజులుగా పలు కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అర్జున్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారని వార్తలు రాగా, ఆ తర్వాత అల్లు అర్జున్ మూడు తరాలకు చెందిన నలుగురు వ్యక్తుల పాత్రల్లో కనిపించనున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా అర్జున్ స్క్రీన్ పై సందడి చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అట్లీ ఆలోచనకు ఫిదా అయిన బన్నీ ఆయా పాత్రల్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
అయితే, హీరో అర్జున్ పాత్రలకు సంబంధించి చిత్ర నిర్మాణ బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ విషయం ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది.. ఒకవేళ తాజాగా వచ్చిన కథనాలు నిజమైతే ఒక సినిమా కోసం విభిన్నమైన పాత్రల్లో బన్నీ నటించడం ఇదే తొలిసారి అని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. ఇక ఈ చిత్రం పునర్జన్మల కాన్సెప్ట్‌తో ముడిపడి సైన్స్ ఫిక్షన్ మూవీగా ఇది రూపొందనుందని టాక్. దీని కోసం చిత్రబృందం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉంది. ఈ క్రమంలో హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఈ సినిమా కోసం రంగంలోకి దిగిందని అంటున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.ఇందులో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.