Folk Arts | న్యూశాయంపేట, నవంబర్ 27 : కనుమరుగవుతున్న జానపద కళలకు పూర్వవైభవం తీసుకురావాలని తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న అన్నారు. గురువారం హంటర్ రోడ్డులోని పీఠం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో
ఎంఏ తెలుగు కోర్సు విద్యార్థులకు జానపద కళలపై అవగహన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా హసన్ పర్తి మండలం పెగడపల్లికి చెందినచిందుయక్షగాన కళాకారుడు, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత గజవెల్లి ఏసోబును సత్కరించారు. అనంతరం ఏసోబు మాట్లాడుతూ.. చిందుయక్షగాన కళారంగానికి, కళాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వ తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పీఠం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దామోదర్, సురేష్, రవికుమార్, గోపాల్‌రెడ్డిలతో పాటు పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
Removed flexi | ఫ్లెక్సీలను తొలగించిన అధికారులు.. ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన
Harish Rao | కాళోజీ వర్సిటీలో అవినీతి బాగోతంపై గవర్నర్‌కు హరీశ్‌రావు లేఖ
Girl Pushed Into Prostitution By Mother | బాలికను వ్యభిచారంలోకి నెట్టిన.. తల్లి, పొరుగు వ్యక్తి