బూర్గంపహాడ్, జూలై 25 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామికవాడ సారపాకలో పంచాయతీ కార్యదర్శి గుగులోత్ రవికుమార్ పంచాయతీ సిబ్బందిచే శనివారం పారిశుధ్య చర్యలు చేపట్టారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా పంచాయతీ పరిధిలోని కాలనీల్లో సైడ్ డ్రైన్లలో బ్లీచింగ్ చల్లించి దోమల నివారణకు చర్యలు చేపట్టారు. మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించారు. ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.