‘జాతీయ రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలి’
బూర్గంపహాడ్ మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం- సారపాక మధ్య గల జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతిందని, భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ఈ రహదారిపై ప్రయాణించాలంటే నానా అవస్థలు పడుతున్నారని తక్షణమే రహదారికి..
– తెలంగాణ రైతుకూలీ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యుడు డి.పున్నంచంద్
బూర్గంపహాడ్, జూలై 25 : బూర్గంపహాడ్ మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం- సారపాక మధ్య గల జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతిందని, భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ఈ రహదారిపై ప్రయాణించాలంటే నానా అవస్థలు పడుతున్నారని తక్షణమే రహదారికి మరమ్మతులు చేపట్టాలని తెలంగాణ రైతుకూలీ సంఘం జిల్లా కమిటీ సభ్యుడు డి.పున్నంచంద్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ నిత్యం ఈ జాతీయ రహదారి గుండా భద్రాచలం పుణ్యక్షేత్రానికి వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలో గుంతలు ఏర్పడిన రహదారి కావడంతో ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమస్యపై సంబంధిత శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా పరిష్కరించడం లేదన్నారు. తక్షణమే ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి గుంతలతో ఉన్న జాతీయ రహదారికి మరమ్మతులు చేయించి వాహనదారుల ప్రాణాలు కాపాడాలని ఆయన కోరారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

