National Highway | ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ ఎదుట వాహనాల రాకపోకలు స్తంభించి రెండు దశాబ్దాలు దాటింది. చాలా కాలానికి అధికారులు వాహనాల రాక రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో ఈ మార్గంలో వాహనాలు వెళుతున్నాయి.
2001లో ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌పై అప్పటి పీపుల్స్ వార్ నక్సల్స్ డైరెక్షనల్ మైన్స్ ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్ పేల్చివేశారు. అప్పటినుంచి పోలీస్ స్టేషన్ ముందు రాకపోకలను నిలిపివేసి గేట్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2016లో జాతీయ రహదారి మంజూరు చేసినప్పటికీ ఈ మార్గంలో పోలీస్ స్టేషన్ ముందు గేట్లు తెరుచుకోలేదు. దీంతో ఐటీడీఏ పిఓ నివాస గృహం చుట్టూ వాహనదారులు నాలుగు మూల మలుపులు తిరిగి వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు.
పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు గేట్లను తొలగించడంతో వాహనాల రాకపోకలు ఇవాళ మధ్యాహ్నం నుంచి కొనసాగుతున్నాయి. దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.
Nidamanur | కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పదిమంది మహిళలకు గాయాలు
Jawahar Nagar | 15 కోట్ల విలువైన సర్కారు భూమి కబ్జాకు యత్నం.. కంచెను ఖతం చేసిన కబ్జాదారుడు ఎవరు..?