FASTag Check Post | ఏటూరు నాగారంలోని అటవీశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న చెక్‌పోస్ట్ వద్ద ఫాస్టాగ్ చెక్ పోస్ట్ ను ఇవాళ ప్రారంభించారు. టోల్గేట్ తరహాలో ఏర్పాటు చేసిన ఈ చెక్ పోస్ట్‌ను అటవీ శాఖ అధికారులు వినియోగంలోకి తీసుకువచ్చారు. ఇక్కడ గతంలోనే ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద ఇసుక లారీలు, ఇతర భారీ వాహనాల నుంచి రుసుము వసూలు చేశారు.
కాగా టెక్నాలజీ పెరగడంతో అటవీ శాఖ అధికారులు మాన్యువల్ వసూళ్లను నిలిపేసి.. ఏకంగా ఫాస్టాగ్ ప్రారంభించారు. తాజా చెక్‌పోస్ట్ ఏర్పాటు నేపథ్యంలో వాహనాలు ఫాస్టాగ్ వద్దకు వెళ్లగానే స్కాన్ చేసి పంపిస్తుంది. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏటూరునాగారంలో ఫాస్టాగ్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం విశేషం. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, అంబులెన్సులు వెళ్లడానికి మరో మార్గంలో కూడా అధికారులు ఏర్పాటు చేశారు.
Nidamanur | కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పదిమంది మహిళలకు గాయాలు
Jawahar Nagar | 15 కోట్ల విలువైన సర్కారు భూమి కబ్జాకు యత్నం.. కంచెను ఖతం చేసిన కబ్జాదారుడు ఎవరు..?