ములుగు : ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంకటాపురం నూగూరు మండలం చిరుతపల్లి గ్రామంలో మొక్కజొన్న సాగు చేసిన రైతు శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లోకం మధుకృష్ణ (35) అనే రైతు ఇటీవల బాండు హైటెక్ కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలతో పంట సాగువేశాడు. సరైన దిగుబడి రాకపోవడంతో పెట్టుబడులు నష్టపోయి అప్పుల పావడంతో మనస్థాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | కాంగ్రెస్ పాలన పంచతంత్రంలో నీలిరంగు పూసుకున్న నక్క లాంటిది : హరీశ్‌రావు
Gandhi Tatha Chettu | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
పది పరీక్షకు 20 నిమిషాలు ఆలస్యంగా.. అనుమతించని అధికారులు