Vemulawada : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో విషాదం చోటుచేసుకుంది. దైవదర్శనానికి వచ్చిన ములుగు జిల్లా మల్లంపల్లి మండలం భూపాల్ నగర్ (పందికుంట)కు చెందిన సాదం రాజు(32) మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని కోనేరులో పడిన అతడు మరణించాడు.
సాదం సమ్మయ్యకు ముగ్గురు కుమారులు కాగా రాజు(32) రెండో కుమారుడు కాకతీయ విశ్వవిద్యాలయంలో పీజీ, ఎంఈడి పూర్తి చేసి ప్రభుత్వ కొలువుల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. తిరుపతి, వేములవాడ కోసం వెళ్లి వస్తానని 05/06/2025 తేదీన ఉదయం 8 గంటలకు ఇంటి నుండి బయలుదేరాడు. ఈరోజు 08/06/2025 ఉదయం 5:30లకు రాజు బంధువైన జక్కుల మహేందర్ వేములవాడ దైవదర్శనానికని వచ్చి రాజుకు కాల్ చేయగా అతడు లిఫ్ట్ చేయలేదు.
తాను ఉదయం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కు వెళ్తానని తనతో చెప్పిన రాజు ఫోన్ ఎత్తకపోవడంతో ఇతర బంధువులు కూడా లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఆవరణలో రాజు కోసం వెతికారు. అయితే.. పక్కనే ఉన్న కోనేరు దగ్గర రాజుకు సంబంధించిన బ్యాగు, చెప్పులు, పర్సు లభించాఇయి. కోనేరులో పడి ఉంటాడనే అనుమానంతో అందులో వెతకగా రాజు మృతదేహం లభించింది. వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం కోసం బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. పంచనామా అనంతరం స్వగ్రామానికి రాజు మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్లనున్నారు.