Padmanabhaswamy Temple | 270 ఏళ్ల తర్వాత.. పద్మనాభస్వామి ఆలయంలో అరుదైన మహా కుంభాభిషేకం
Padmanabhaswamy Temple | కేరళ రాజధాని తిరువనంతపురంలోని ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయంలో 270 సంవత్సరాల తర్వాత అరుదైన మహా కుంభాభిషేకం నిర్వహించారు. పురాతన ఆలయంలో చాలా కాలంగా కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి.
తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలోని ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయంలో (Padmanabhaswamy Temple) 270 సంవత్సరాల తర్వాత అరుదైన మహా కుంభాభిషేకం నిర్వహించారు. పురాతన ఆలయంలో చాలా కాలంగా కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రత్యేకమైన పవిత్రోత్సవం జరిగింది. గర్భగుడి పైన ఉన్న మూడు గోపురాలు, విశ్వక్సేన విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించడం, తిరువంబడి కృష్ణ ఆలయంలో ‘అష్టబంధ కలశం’ ఏర్పాటు వంటి పూజా కార్యక్రమాలను ఆలయ పూజారులు నిర్వహించారు. ట్రావెన్కోర్ రాజకుటుంబం ప్రస్తుత అధిపతి మూలం తిరునాల్ రామ వర్మ, ఆ రాజకుటుంబ సభ్యుల సమక్షంలో ఈ క్రతువులు జరిగాయి.
కాగా, పునరుద్ధరించిన ఆలయంలో ఆధ్యాత్మిక శక్తి బలోపేతం, ఆలయం పవిత్రతను తిరిగి పొందడం మహా కుంభాభిషేకం ప్రధాన ఉద్దేశమని ఆలయ అధికారులు తెలిపారు. మహా కుంభాభిషేకానికి వారం ముందు నుంచి ఆచార్య వరణం, ప్రసాద శుద్ధి, ధార, కలశం వంటి ఇతర ఆచారాలు నిర్వహించినట్లు చెప్పారు.
మరోవైపు కేరళ గవర్నర్ విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించి ఈ అరుదైన ఆచారాన్ని వీక్షించారు. 270 ఏళ్ల తర్వాత నిర్వహించిన అరుదైన మహా కుంభాభిషేకాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాలుగు ప్రవేశ ద్వారాల వద్ద భారీ స్క్రీన్లపై పూజా క్రతువులను ప్రదర్శించారు.
Also Read:
ఆరోగ్య మంత్రి ఆదేశాన్ని తోసిపుచ్చిన గోవా సీఎం.. డాక్టర్‌ను సస్పెండ్ చేయబోమని హామీ
మహిళా న్యాయమూర్తి మంగళసూత్రం చోరీ.. పది మంది ఆడ దొంగలు అరెస్ట్
రూ.20 లక్షల నగల బ్యాగ్‌ను లాక్కెళ్లిన కోతి.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

