Heinrich Klaasen : దక్షిణాఫ్రికా హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) ఈమధ్యే వీడ్కోలు ప్రకటనతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ 18వ సీజన్లో సూపర్ సెంచరీ బాదిన అతడు వన్డే వరల్డ్ కప్ ఆడాలనుకున్నాడు. కానీ, ఉన్నట్టుండి అంతర్జాతీయ క్రికెట్‌కు ఎందుకు వీడ్కోలు పలికాడు. దాంతో, క్లాసెన్ ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అనేది ఫ్యాన్స్‌కు అంతుచిక్కడం లేదు. అయితే.. తన రిటైర్మెంట్పై క్లాసెన్ ఎట్టకేలకు పెదవి విప్పాడు. రెండు కారణాల వల్లనే తాను ఇకపై దేశానికి ఆడకూడదనే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడీ చిచ్చరపిడుగు.
విధ్వంసక ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైన క్లాసెన్ హఠాత్తుగా వీడ్కోలు పలకలేదు. సౌతాఫ్రికా సెలెక్టర్ల తీరు, హెడ్‌కోచ్ మార్పు వంటి పరిస్థితులు అతడిని ఆ దిశగా పురిగొల్పాయి. రాబ్ వాల్టర్ (Rob Walter) కోచ్‌గా వైదొలగడం, సెంట్రల్ కాంట్రాక్ట్‌లో తన పేరు లేకపోవడంతోనే రిటైర్మెంట్ నిర్ణయానికి వచ్చానని క్లాసెన్ తెలిపాడు.
Heinrich Klaasen has announced his immediate retirement from international cricket, bringing an end to a distinguished seven-year career with the Proteas Men.
The 33-year-old announced on Monday that he would be stepping away from the white-ball formats, which follows his… pic.twitter.com/RwAPBZVoeO
— Proteas Men (@ProteasMenCSA) June 2, 2025
‘నాకు 2027 వరల్డ్ కప్‌లో ఆడాలని ఉండేది. కానీ, మా బోర్డు తీరుతో విసిగిపోయాను. పైగా హెడ్‌కోచ్ రాబ్ వాల్టర్ వైదొలగడంతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్‌లో నాకు చోటుదక్కకపోవడం నన్ను బాధించాయి. అందుకే గత కొన్ని రోజులుగా నేను ఎలా ఆడుతున్నాను? మా జట్టు గెలుపు ఓటముల గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రాబ్‌తో సుదీర్ఘంగా చర్చించాను.
రాబ్ వాల్టర్
సౌతాఫ్రికా క్రికెట్లో జరుగుతున్న పరిణామాల పట్ల నేను అస్సలు సంతోషంగా లేనని ఆయనకు చెప్పాను. మునపటిలా దేశానికి ఆడడాన్ని నేను ఎంజాయ్ చేయడం లేదని వివరించాను. అయితే.. 2027 వరల్డ్ కప్ వరకూ జట్టులో ఉండాలని భావించాను. కానీ, హెడ్‌కోచ్‌గా రాబ్ పదవీకాలం ముగియడంతో నా ఆలోచన మారింది. బోర్డు సైతం నా విషయంలో శ్రద్ధ చూపించలేదు. సో.. ఇవన్ని నా నిర్ణయాన్ని తేలిక చేశాయి. ఇప్పుడు నేను ఏడాదిలో కనీసం ఆరు లేదా ఏడు నెలలు ఇంటి పట్టునే ఉండొచ్చు. మా కుటుంబంతో సమయాన్ని గడపడానికి వీలవుతుంది. నాలుగేళ్లు విశ్రాంతి లేకుండా ఆడాను. ప్రస్తుతం నేను రిలాక్స్ అవ్వాలనుకుంటున్నా’ అంటూ తన వీడ్కోలుకు దారి తీసిన పరిస్థితులను వివరించాడీ హిట్టర్.
వికెట్ కీపర్, బ్యాటర్ అయిన క్లాసెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 17వ సీజన్లో మెరుపు బ్యాటింగ్‌తో అలరించిన అతడిని ఆరెంజ్ ఆర్మీ రూ.23 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ సఫారీ ప్లేయర్ 18వ సీజన్లో మెరుపు సెంచరీ బాదాడు. 12 మ్యాచుల్లో 487 రన్స్ కొట్టాడు.